: కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా
చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ప్రపంచంలో బలమైన రక్షణ శక్తిగా ఎదిగిన చైనా, భారత్ పై ఏదో ఒకరకమైన శత్రుత్వం పెంచుకునేందుకు ఉబలాటపడుతోంది. పాక్, శ్రీలంకలతో అవసరానికి మించి స్నేహసంబంధాలు పెంచుకుంటున్న చైనా, భారత్ భూభాగంలో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. మార్చి 20, 28 తేదీల్లో లడఖ్ లోని వాస్తవాధీన రేఖను దాటేందుకు చైనా బలగాలు ముందుకు వచ్చాయని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో చైనా అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తుండగానే, ఆ దేశ సైన్యం వాస్తవాధీన రేఖను దాటుకుని ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారత సైనికులు వీరిని అడ్డుకోవడంతో వారు వెనక్కి మళ్లినట్టు వారు తెలిపారు. అయితే సరిహద్దు ప్రాంతాలకు చైనా రైలు, రోడ్డు మార్గాలు పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.