: నల్గొండ జిల్లాలో విస్తరిస్తున్న తీవ్రవాద కలాపాలు?


గతంలో నల్గొండ జిల్లాలో విరివిగా కనిపించిన తీవ్రవాద లింకులు మరోసారి తెరపైకి వస్తున్నాయి. గతంలో ఇద్దరు నల్గొండ జిల్లా వాసులు సిమీ జాతీయనేతలుగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు జిల్లాలో స్లీపర్ సెల్స్ ను తయారు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మంది సిమి ఉగ్రవాదులు నల్గొండ జిల్లాలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత తీవ్రవాదులు మారుమూల ప్రాంతమైన జానకీపురం, అర్వపల్లి తదితర ప్రాంతాల్లో సంచరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేటలో కాల్పులకు తెగబడిన అనంతరం వారు మారుమూల ప్రాంతాన్ని ఎంచుకోవడంతో, వారికి గతంలో ఈ ప్రాంతంతో పరిచయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు సూర్యాపేటలో ఎన్ కౌంటర్ కు ముందు చాదర్ ఘాట్ లో బస్సు ఎక్కినప్పుడు వారు తెలుగులో డ్రైవర్ తో మాట్లాడినట్టు ఆధారాలున్నాయి. దీంతో, వారు సిమీ స్లీపర్ సెల్స్ తో సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించుకునేందుకు వచ్చినట్టు కొత్త కోణం వెలుగు చూస్తోంది. దీంతో మరోసారి పోలీసులకు సవాలు విసిరేందుకు సిమీ సన్నద్ధమవుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News