: నాలుగు మిలియన్ల అభిమానం సంపాదించిన అలియా భట్
బాలీవుడ్ యంగ్ టాలెంట్ అలియా భట్ నాలుగు మిలియన్ల అభిమానుల్ని సంపాదించుకుంది. సామాజిక మాధ్యమంలో అలియా ఓ సంచలనం. ఎందుకంటే, ఆమెపై వేసినన్ని జోకులు ఏ ఇతర నటీనటులపై ఉండవు. వాటన్నింటినీ సరదాగా తీసుకునే అలియా భట్, తనపై పేలుతున్న జోకులను భలే ఆస్వాదిస్తుంది. కొన్నిసార్లు బాధపడ్డా, తన అల్లరితో ఆకట్టుకుంటుంది. ఏ స్పందననైనా వెంటనే తెలియజేసే అలియా భట్ కు ట్విట్టర్లో నాలుగు మిలియన్ల అభిమానులు ఉన్నారు. ఈ సందర్భంగా, తనను అనుసరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పింది. అభిమానుల అంచనాలకు అనుగుణంగా నటిస్తానని హామీ ఇచ్చింది.