: కోఠి ప్రసూతి ఆసుపత్రిలో దారుణం
హైదరాబాదులోని కోఠి ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన సుమలత నెలలు నిండడంతో, పురుటి నొప్పులతో కోఠి ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటనలో పుట్టిన పసికందు కిందపడడంతో తలపగిలి మృతి చెందాడు. దీంతో ఆమె, కుటుంబసభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇంత దారుణం జరిగిందని వారు ఆందోళనకు దిగారు.