: ఆర్డినెన్స్ తీసుకురావాల్సినంత అవసరం ఏంటి?: వీహెచ్
భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సినంత అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు బీజేపీ నడుం బిగించిందని ఆరోపించారు. అందులో భాగంగానే భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని అన్నారు. లేకుంటే అంత అర్జెంటుగా భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని, ప్రతిపక్షాలు, దేశ ప్రజలను సంతృప్తి పరచిన తరువాత బిల్లునే తీసుకురావాల్సింది కదా? అని ఆయన ప్రశ్నించారు. భూమిపై ఆధారపడి బతుకుతున్న రైతులు చాలా మంది ఉన్నారని, వారి పొట్టకొట్టడం సరికాదని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు భూసేకరణ బిల్లును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.