: ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక లోపం... పైలట్ సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు


సాంకేతిక లోపం తలెత్తిన ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన అమెరికాలోని నెవార్క్ నగరంలోని లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి తెల్లవారుజామున జరిగింది. నెవార్క్ నుంచి తెల్లవారుజామున ఎయిర్ ఇండియా విమానం ముంబైకి బయలుదేరింది. 29 వేల అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానం మొత్తం కంపించడం ప్రారంభమైంది. దీంతో వేగంగా స్పందించిన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారాన్ని చేరవేశాడు. ఏటీసీ అధికారుల సలహా మేరకు తిరిగి విమానాన్ని లిబర్టీ ఎయిర్ పోర్టులోనే సురక్షితంగా దించేశాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం విమానాన్ని పరిశీలించగా, ఇంజిన్ లో ఓ బ్లేడ్ విరిగిపోయినట్లు గుర్తించారు.

  • Loading...

More Telugu News