: కేసుల సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టండి: జడ్జిలకు ప్రధాని మోదీ పిలుపు


న్యాయవ్యవస్థపై దేశ ప్రజలకు అపార విశ్వాసముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా కేసులకు సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న న్యాయవ్యవస్థ సదస్సును ఆయన కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ఉత్తమ న్యాయవ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని న్యాయమూర్తులు గుర్తించాలన్నారు. వ్యక్తులు మంచివాళ్లే, వ్యవస్థలోనే ఎక్కడో లోపముంది, దానిని గుర్తించి సవరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. న్యాయవ్యవస్థ ఉన్నతి కోసం ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News