: సోదరభావం, ఐకమత్యం పెంపొందాలి.... దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈస్టర్ విషెస్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'దేశంలోని ప్రతిఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. సమాజంలో సోదర భావం, ఐకమత్యానికి ఈ రోజు మరో ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను' అని అందులో తెలిపారు. క్రీస్తు బోధనలు మొత్తం మానవాళికి మానవత్వాన్ని పెంపొందించుకునేందుకు ప్రోత్సాహకంగా ఉంటాయని అన్నారు. న్యాయంతో కూడిన ప్రపంచాన్ని సృష్టిద్దామని, సర్వమానవుల పట్ల దయతో ఉంటూ ఆనందంగా గడుపుదామని ఈ సందర్భంగా అందరం ప్రమాణం చేయాలని ఆయన కోరారు.