: సుదీర్ఘ సెలవు తీసుకుని రాహుల్ తప్పు చేశారు... డిగ్గీ రాజా సంచలన వ్యాఖ్య
గాంధీ కుటుంబానికే కాక కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ సెలవు తీసుకుని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రాహుల్ పై విసురుతున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ముందుండే డిగ్గీరాజా, ఈ సారి రాహుల్ కు వ్యతిరేకంగా, ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. ‘‘రాహుల్ గాంధీ సెలవు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సెలవును రాహుల్ గాంధీ పొడిగించడం తప్పు’’ అంటూ ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి అప్పగించిన తర్వాత కూడా సోనియా గాంధీ పార్టీకి దూరం కారాదని ఆయన తన స్వామి భక్తిని చాటుకున్నారు.