: కేజ్రీ పార్టీలోకి ఇన్ఫీ నారాయణ మూర్తి?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపక ఛైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నాయి ఢిల్లీలోని రాజకీయ వర్గాలు. గత మంగళవారం ఎన్ఆర్ నారాయణమూర్తి ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో భేటీ అయ్యారు. కేజ్రీ అపాయింట్ మెంట్ కోసం నారాయణమూర్తే నేరుగా ఫోన్ చేశారట. కేజ్రీ కార్యాలయంలో నారాయణమూర్తి కనిపించడంతో ఆయన రాజకీయ రంగప్రవేశం, ఆప్ లో చేరనున్నారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న 'అక్షయ పాత్ర'కు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వంతో చర్చించేందుకే నారాయణమూర్తి కేజ్రీని కలిశారని ఇన్ఫీ వర్గాలు చెబుతున్నాయి. నారాయణమూర్తితో కేజ్రీవాల్, సిసోడియాలు అన్ని అంశాలపై చర్చించారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.