: పవిత్ర దినాన విందు, సదస్సులా?... హాజరు కాలేను: మోదీకి షాకిచ్చిన సుప్రీం జడ్జి!


ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ షాకిచ్చారు. క్రైస్తవులకు పవిత్ర దినాలైన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజుల్లో విందులు, సమావేశాలు ఏమిటంటూ ఆయన లేఖాస్త్రం సంధించి సంచలనం రేపారు. శనివారం నాటి మోదీ విందుతో పాటు నేటి నుంచి ప్రారంభం కానున్న న్యాయమూర్తుల సదస్సుకు హాజరుకాలేనని సదరు లేఖలో ఆయన తేల్చిచెప్పారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న న్యాయసదస్సు నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టుతో పాటు అన్ని రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులకు మోదీ విందు ఏర్పాటు చేశారు. అయితే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ల నేపథ్యంలో తాను తన కుటుంబంతో తన సొంతూళ్లో గడపడానికే ప్రాధాన్యమిస్తానని చెప్పిన జస్టిస్ కురియన్... విందుతో పాటు సదస్సుకూ హాజరుకాలేనని, అన్యధా భావించరాదని ఈ నెల 1న ప్రధానితో పాటు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News