: వెంకయ్య మాట నాకు వేదం... తెలుగు నేతపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్య


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు ముగింపు సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సీనియర్ నేత, మాజీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, తెలుగు నేత వెంకయ్యనాయుడిపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వెంకయ్య మాట తనకు వేదమని ప్రకటించిన మోదీ, వెంకయ్య మార్గదర్శకత్వం లభించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో మూడు పర్యాయాలు వెంకయ్య పేరును ప్రస్తావించిన మోదీ, వెంకయ్య కారణంగా ఢిల్లీలో ఈజీగానే నెట్టుకొస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. ‘‘నాకసలు పార్లమెంట్ అంటే ఏమిటో తెలియదు. ఢిల్లీయే నాకు కొత్త. కానీ, వెంకయ్య ఉండటం వల్ల ఏ సమస్యా ఉండటం లేదు. ఆయన ఏం చెబితే నేను అదే వింటాను’’ అని మోదీ అన్నారు. అంతేకాక ‘‘నా కేబినెట్ లో సమర్థులైన నేతలున్నారు. పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన వెంకయ్య కూడా కేబినెట్ లో ఉండటం నా అదృష్టం. అద్వానీ, వెంకయ్యలాంటి పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారి మార్గదర్శకత్వం లభించడం నాకు గర్వకారణంగా ఉంది’’ అని కూడా మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News