: మూడురోజుల తెలంగాణ పోలీసుల టెన్షన్ ముగిసిందిలా...ప్రత్యక్ష సాక్షి కథనం


మూడురోజుల పాటు తెలంగాణ పోలీసుల కంటిపై కునుకు లేకుండా చేసిన దుండగుల కథ ఎలా ముగిసిందో తెలుసా...ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం... సూర్యాపేటలో ఇద్దరు పోలీసుల్ని చంపిన సిమి కార్యకర్తలను పట్టుకునేందుకు సాయుధులైన పోలీసులు జల్లెడపట్టడం ప్రారంభించారు. దీంతో నల్గొండ జిల్లా సీతారామపురం, అరవపల్లి ప్రాంతంలో తచ్చాడిన దుండగులు, అటువైపుగా బైక్ పై వస్తున్న ఓ స్థానికుడి కణతపై తుపాకీ పెట్టి, బైక్ అపహరించారు. దీంతో స్థానికుడు పోలీసులకు సమాచారమందించి, తన మిత్రులకు సమాచారం అందించాడు. దీంతో ధైర్యవంతులైన కొంత మంది యువకులు వారిని వేటాడేందుకు బయల్దేరారు. వారికి తోడుగా ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు. వారంతా అక్కడి ఇసుక మేటల్లో గాలిస్తూ ఉండగా, వారికి దుండగులు తారసపడ్డారు. దీంతో వారిపై దుండగులు కాల్పులు జరిపారు. వారి కాల్పులకు భయపడ్డ స్థానికులు పరుగందుకున్నారు. దీంతో వారి బైక్ ను అపహరించి, మళ్లీ పరుగు ప్రారంభించారు. ఈ క్రమంలో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసుల వేట ఆరంభమైంది. వారిని ఛేజ్ చేసుకుంటూ పోలీసులు వెంబడించారు. ఆ ప్రాంతమంతా ఇసుకమేటలు ఉండడంతో పోలీసులు వారిని ఎక్కువ దూరం వెంబడించలేకపోయారు. ఇంతలో దుండగులు దిశమార్చి పోలీసులను ఏమార్చుదామని ప్రయత్నించారు. ఇంతలో వారిని వెదుకుతున్న మరో పోలీస్ జీపు వారికి ఎదురు పడింది. పోలీసులు వారిని ఆగమనడంతో వారు పోలీసుల వద్దకు వస్తున్నట్టు నటించి, పోలీసులను చేరుకుని, ఎస్సై, డ్రైవర్ నాగరాజు కణతకు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపులకు దిగారు. వెనుక ఉన్న సీఐ, ఇతర పోలీసులు అప్రమత్తమై చకచకా కిందికి దిగారు. వారు కాల్పులు ప్రారంభించే లోపు దుండగులు నాగరాజు, ఎస్సైలను కాల్చేశారు. తలో దిక్కు దిగి పొజిషన్స్ తీసుకున్న పోలీసులు వారిని చుట్టుముట్టి కాల్పులకు దిగడంతో వారి ఆటకట్టింది. దీంతో వెంటనే పోలీసులు వారి ఫోటోలను ఎన్ఐఏకి పంపారు. వారు వీరిని చూసి మధ్యప్రదేశ్ జైలు నుంచి తప్పించుకున్న 12 మంది సిమి ఉగ్రవాదుల్లో ఇద్దరుగా గుర్తించి వారు పేర్లు చెప్పారు. దీంతో ఇతరులు కూడా తెలుగు రాష్ట్రాల్లో దాక్కుని ఉంటారనే భయంతో అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అందర్నీ అప్రమత్తం చేశారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన ఎస్సైని కామినేని ఆసుపత్రిలో చేర్చారు. అతని శరీరంలో దిగబడిన మూడు బుల్లెట్లను వైద్యులు బయటకు తీశారు. కానీ, అతని మెదడులో దిగిన బుల్లెట్ తీయడంపై నిపుణులతో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News