: దర్గాలో నిద్రించిన సిమి కార్యకర్తలు...అదుపులో మౌలానా


నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పలు కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. సూర్యాపేటలో పోలీసులను కాల్చి చంపిన సిమి కార్యకర్తలు తరువాత ఎక్కడ తలదాచుకున్నారు? ఏం చేశారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు జానకీపురం దగ్గర్లోని అరవపల్లి దర్గాలో గత రాత్రి తలదాచుకున్నట్టు తెలుస్తోంది. అస్లం ఆయూబ్, జాకీర్ లు అరవపల్లి దర్గాలో రాత్రి నిద్రించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ముతావల్లి మౌలానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దుండగుల దగ్గర ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టు ట్రైన్ టికెట్ లభ్యమైంది. దీంతో ఇద్దరేనా? లేక ఎక్కువ మంది హైదరాబాద్ చేరుకున్నారా? అని ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News