: మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళికలు లేవు...అందుకే వివాదాలు: శరద్ యాదవ్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నిర్దిష్టమైన లక్ష్యాలు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వాటిపై వ్యాఖ్యలు, ప్రచారం చేసుకుంటూ బీజేపీ పబ్బం గడుపుకుంటోందని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథాన నడిపేందుకు వారివద్ద స్పష్టమైన ప్రణాళికలు ఏవీ లేవని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాయి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటాయని ఆయన తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వానికి ఇలాంటి లక్ష్యాలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు.