: సూర్యాపేట కాల్పుల్లో గాయపడిన ఎంపీటీసీని పరామర్శించిన నారా లోకేష్


నల్లొండ జిల్లా సూర్యాపేట వద్ద సిమీ కార్యకర్తలుగా భావిస్తున్న వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఎంపీటీసీ దొరబాబును టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేష్ పరామర్శించారు. ఆయనతో పాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా పరామర్శించారు. దొరబాబు కుటుంబంతో కూడా మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాల్పుల్లో గాయపడిన ఎంపీటీసీ దొరబాబు హైదరాబాదులోని కేపీహెచ్ బీలో ఉన్న ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News