: తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదు: జీవన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకంపై టీ.కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల ప్రజలకు ఎలాటి మేలు జరగదని విమర్శించారు. ఈ పథకం వల్ల రూ.2వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాబోతుందని చెప్పారు. ఆ రెండువేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేయొచ్చని ప్రభుత్వానికి సూచించారు. వృథా అయ్యే నిధులతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టవచ్చని సలహా ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పు చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.