: కామాంధుల నుంచి తప్పించుకునేందుకు ఆత్మాహుతి యత్నం... చావుబతుకుల మధ్య పూణె బాలిక
పగబట్టి కాటేసేందుకు యత్నించిన కామాంధుల నుంచి పదహారేళ్ల ఆ బాలిక తనను తాను కాపాడుకుంది. ఈ క్రమంలో కామాంధుల బారి నుంచి లైంగిక దాడిని తప్పించుకున్న ఆ బాలిక, తనకు తాను పెట్టుకున్న నిప్పు కారణంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒళ్లు జలదరించే ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె సమీపంలోని దౌండ్ తాలుకా యావత్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 1న జరిగిన ఈ దారుణ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక ఆత్మాహుతి యత్నానికి కారణమైన ఏడుగురు కామాంధులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఇంటి ఆవరణలో ఓ స్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు వెళ్లిన నిందితులను బాలిక తల్లి అడ్డుకుందట. దీంతో ఆ కుటుంబంపై కక్ష గట్టిన నిందితులు బాలికపై అఘాయిత్యానికి యత్నించారని పోలీసులు చెప్పారు.