: లంక సైన్యం అదుపులో 33 మంది భారత జాలర్లు
ప్రతిసారీ శ్రీలంక జలాల్లోకి తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చొరబడటం, వారిని లంక సైన్యం అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా దాదాపు 33 మంది భారత జాలర్లను శ్రీలంక సైన్యం అరెస్టు చేసింది. నెదుంతీవు ప్రాంతానికి దగ్గరలోని తమ దేశ జలాల్లో చేపల వేటకు వెళ్లిన నాగపట్నం జిల్లాకు చెందిన జాలర్లను అదుపులోకి తీసుకున్నామని లంక ఫిషరీస్ విభాగం అధికారులు చెప్పారు. వారి నుంచి ఐదు బోట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.