: ఒబామాపై నాకు చాలా ప్రేమ ఉంది: 'రాపర్' ఎజెలియా బాంక్స్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తనకు చాలా ప్రేమ ఉందని ప్రముఖ రాపర్ ఎజెలియా బాంక్స్ చెబుతోంది. 'బిల్ బోర్డ్' అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన 23 ఏళ్ల ఈ చిన్నది ఒబామాపై తనకున్న అభిమానం గురించి వెల్లడించింది. ఇదే సమయంలో తనకు ఎలాంటి భాగస్వామి కావాలో చెబుతూ, తనకు సెక్యూరిటీ గార్డులంటే ఇష్టమని అంటోంది. అయితే చాలా స్మార్ట్ గా, ఫన్నీగా జోక్స్ చేసే వ్యక్తి అంటే చాలా ఇష్టమని తెలిపింది.