: మియామి ఓపెన్ లో ఫైనల్ చేరిన సానియా జోడీ... మలేషియా ఓపెన్ నుంచి సైనా ఔట్
భారత్ కు చెందిన సానియా మీర్జా, స్విట్జర్లాండ్ కు చెందిన మార్టినా హింగిస్ జోడీ మియామీ ఓపెన్ డబుల్స్ లో ఫైనల్ చేరారు. సెమీ ఫైనల్లో బాబోస్-లదనోవిచ్ జోడీపై 6-2, 6-4 తేడాతో సానియా-హింగిస్ జోడీ గెలుపొందింది. ఫైనల్లో మకరోవా-లెనా వెస్నినా జోడీతో వారిద్దరూ తలపడనున్నారు. ఈ టైటిల్ గెలుపొందితే సానియా జోడీ ఖాతాలో రెండో టైటిల్ చేరుతుంది. మరోవైపు మలేషియా ఓపెన్ సిరీస్ లో సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. కౌలాలాంపూర్ లో జరిగిన ఈ సిరీస్ సెమీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి లీ జ్యూరీ చేతిలో ఓటమిపాలైంది. 21-13, 17-21, 20-22 తేడాతో సైనా వెనుదిరిగింది.