: ప్రపంచం దృష్టిలో బుద్ధిలేని నేతలుగా భారత ఎంపీలు!: కేంద్ర మాజీ మంత్రి రాందాస్
ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి సాక్ష్యం లేదంటూ, అత్యంత మూర్ఖ వ్యాఖ్యలు చేస్తున్న భారత పార్లమెంట్ సభ్యులు ప్రపంచం దృష్టిలో బుద్ధిలేని నేతలుగా మిగులుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఏ.రాందాస్ వ్యాఖ్యానించారు. పొగాకుతో ఆరోగ్యం పాడవుతుందని వందలాది అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలియని ప్రజాప్రతినిధులతో కూడిన బీజేపీ దేశాన్ని పాలిస్తోందని ఆయన విమర్శించారు. మధుమేహాన్ని కలిగిస్తున్న పంచదారకు లేని నిషేధం పొగాకుకు ఎందుకని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇండియాలో రోజుకు 5,500 మంది చిన్నారులు పొగాకు సేవనానికి అలవాటు పడుతుండగా, 2,500 మంది పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని రాందాస్ తెలిపారు.