: పర్వతాల ఒడిలో మస్తాన్ బాబు శాశ్వత నిద్ర... ఆండీస్ పర్వత శ్రేణుల్లో మృతదేహం


ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత మస్తాన్ బాబు అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో విగతజీవిగా కనిపించాడని అధికారులు తెలిపారు. ఈ వార్త వెలువడిన తరువాత మస్తాన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. "పర్వతాలు తమ ముద్దు బిడ్డను అక్కున చేర్చుకున్నాయి. రెస్ట్ ఇన్ పీస్ మల్లి మస్తాన్ బాబు" అని ఆయనను వెతికేందుకు ప్రారంభించిన ఫేస్ బుక్ పేజి 'రెస్క్యూ మల్లి మస్తాన్ బాబు'లో ట్యాగ్ లైన్ పెట్టగా, అతని మిత్రులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలుపుతున్నారు. 2006లో 172 రోజుల వ్యవధిలో 7 పర్వతాలను అధిరోహించిన మస్తాన్ బాబు గత నెల 24 నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆయన ఆండీస్ అధిరోహణకు బయలుదేరిన వెంటనే వాతావరణం ప్రతికూలంగా మారినట్టు అధికారులు తెలిపారు. మృతికి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ కోరుకొండ సైనిక స్కూల్ లో, ఆపై ఖరగ్ పూర్ లో ఐఐటీ, కోల్ కతాలో ఐఐఎం విద్యలు అభ్యసించారు.

  • Loading...

More Telugu News