: మళ్లీ పరీక్షలకు హాజరైన కేకేఆర్ స్పిన్నర్ నరైన్
తన బౌలింగ్ శైలిపై అనుమానాలను నివృత్తి చేసేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్పిన్నర్ సునీల్ నరైన్ పరీక్షలకు హాజరయ్యాడు. చెన్నైలోని శ్రీరామచంద్ర వైద్య కళాశాలలో బౌలింగ్ నిపుణుల సమక్షంలో ఈ పరీక్షలు జరిగాయి. నేటి మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడొచ్చని తెలుస్తోంది. కాగా, నరైన్ నిన్నటి నుంచే మిగతా ఆటగాళ్లతోపాటు శిక్షణకు హాజరవుతున్నాడని కేకేఆర్ అధికారులు వివరించారు. కాగా, నరైన్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా లేదని ఐసీసీ తెలిపినా, అతడు మళ్లీ పరీక్షలకు హాజరుకావాలని బీసీసీఐ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐ వైఖరిపై కేకేఆర్ యాజమాన్యం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.