: ‘సూర్యాపేట’ షూటర్స్ హతం... జానకీపురంలో కాల్చిచంపిన పోలీసులు
‘సూర్యాపేట’ షూటర్స్ ను పోలీసులు ఎట్టకేలకు మట్టుబెట్టారు. మూడు రోజుల పాటు జరిపిన ఆపరేషన్ లో నేటి ఉదయం సినీ ఫక్కీలో నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు దోపిడీ దొంగలు హతమయ్యారు. ఈ విషయాన్ని నల్గొండ జిల్లా పోలీసులు నిర్ధారించారు. ఎన్ కౌంటర్ లో భాగంగా తమపై మూకుమ్మడి దాడి చేసిన పోలీసులను దోపిడీ దొంగలు తీవ్రంగా ప్రతిఘటించారు. తమపై కాల్పులకు దిగిన పోలీసులపై వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దొంగల కాల్పుల్లో నాగరాజు అనే కానిస్టేబుల్ మృత్యువాత పడగా... ఓ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు సమాచారం.