: డి.కొత్తపల్లి గుట్టల్లో ‘సూర్యాపేట’ షూటర్లు... గుట్టను చుట్టుముట్టిన పోలీసులు


నల్గొండ జిల్లా డి.కొత్తపల్లి గుట్టల సమీపంలో నేటి ఉదయం అలజడి మొదలైంది. సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్ లో రెండు రోజుల క్రితం అర్ధరాత్రి కాల్పులకు తెగబడ్డ దోపిడీ దొంగలు, డి.కొత్తపల్లి గుట్టల్లోకి దూరారన్న సమాచారంతో గుట్టను పోలీసులు చుట్టుముట్టారు. అరవపల్లి నుంచి జనగాం వైపు వెళుతున్న దొంగలు, సీతారామపురం వద్ద పోలీసుల అలికిడిని గమనించి వారిపై కాల్పులకు దిగడంతో పాటు ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి బైక్ లాక్కుని పరారయ్యారు. వీరిని పోలీసులు వెంబడించారు. దీంతో డి.కొత్తపల్లి గుట్టల సమీపంలో బైక్ ను వదిలేసిన దొంగలు పొదల్లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. దుండగులను అనుసరించిన పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు నల్గొండ నుంచి పెద్ద సంఖ్యలో బలగాలను అక్కడికి తరలించారు. ప్రస్తుతం డి.కొత్తపల్లి గుట్టల్లో పోలీసులు నలువైపుల నుంచి కూంబింగ్ ప్రారంభించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News