: మరికాసేపట్లో జేఈఈ మెయిన్స్... హైదరాబాదులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ ఎంట్రెన్స్ లో భాగంగా మెయిన్స్ పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నేటి ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు నగరంలో ఈ పరీక్షకు హాజరుకానున్న 50 వేల మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బీటెక్ కోర్సులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఆర్క్ కోర్సులకు పరీక్షలు జరగనున్నాయి. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హిందూ సంస్థల శోభాయాత్ర నేపథ్యంలో విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.