: పెంపుడు కుక్కను ఉరేసి చంపి తామూ చచ్చిపోయారు!
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేటపాలెం మండలం కొత్తపేటలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అకారణంగా అరెస్టు చేశారని అతడి భార్య, కుమార్తె తీవ్ర మనస్తాపం చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే తమ పెంపుడు కుక్కను ఎవరు చూసుకుంటారని భావించారో ఏమో... ఉరేసి దాన్ని చంపేశారు. ఆపై, తల్లీకూతురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతంతో గ్రామంలో విషాదం నెలకొంది. ముఖ్యంగా, పెంపుడు కుక్కను ఉరేసి చంపడం సంచలనం అయింది.