: భూమా నాగిరెడ్డి పేరిట బెదిరింపులు వస్తున్నాయి: కాంట్రాక్టర్


కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేరిట బెదిరింపులు వస్తున్నాయని రాజశేఖర్ అనే సిమెంటు రవాణా కాంట్రాక్టర్ నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ నంద్యాల రైల్వే స్టేషన్ పనుల నిమిత్తం సిమెంటు సరఫరా చేస్తున్నారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ, న్యాయపరమైన అంశాలు పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు, కేసు దర్యాప్తు డీఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News