: బిల్లుపై పార్లమెంటు లోపల, బయట పోరాడతాం: జైరాం రమేష్
కేంద్రం ప్రవేశపెట్టిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు లోపల, బయట కూడా పోరాడతామని అన్నారు. రైతులకు జరిగే నష్టాన్ని పట్టించుకోకుండా, బిల్లు పాసైతే దాని వల్ల వచ్చే నష్టాన్ని అంచనా వేయకుండా, ప్రజల ఆందోళనలు లెక్కచేయకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయం కాదని ఆయన హితవు పలికారు. భూసేకరణ బిల్లులో ప్రతిపాదిత ఐదు సవరణలు చేస్తే కానీ, దాని గురించి ఆలోచించేది లేదని ఆయన స్పష్టం చేశారు.