: శ్రీలంకలో మృతి చెందింది విశాఖ వాసులే!
శ్రీలంకలో అనుమానాస్పద స్థితిలో భారత జంట మృతి చెందడం తెలిసిందే. ఓ హోటల్ గదిలో వారు విగతజీవుల్లా పడి ఉండడాన్ని గుర్తించిన కొలంబో పోలీసులు దర్యాప్తు చేశారు. దాంతో, వారు విశాఖపట్నం గాజువాక వాసులని తేలింది. ఈ మేరకు శ్రీలంక పోలీసులు విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. తమ వారు శ్రీలంకలో మరణించిన విషయం తెలుసుకున్న మృతుల బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, వారి మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. వారు శ్రీలంక ఎందుకు వెళ్లారు? అక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? వంటి కారణాలను వెలికితీసే పనిలో విశాఖ పోలీసులు నిమగ్నమయ్యారు.