: 66 రోజులు చేపలు తింటూ సముద్రంలో బతికిన జోర్డాన్
జోర్డాన్ అనే అమెరికన్ 66 రోజుల పాటు సముద్రంలో బతికాడు. అమెరికాకి చెందిన చెందిన జోర్డాన్ అనే నావికుడు చేపలు పట్టేందుకు బయల్దేరాడు. సముద్రంలోని అలల ధాటికి పడవ బోల్తా పడడంతో పడవ పై భాగానికి చేరిన జోర్డాన్ రెండు నెలలకు పైగా సముద్రంలో చేపలు తింటూ గడిపాడు. అటు, వేటకు వెళ్లిన జోర్డాన్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఓ జర్మన్ నౌక ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికా నావికాదళ సిబ్బంది హెలికాప్టర్ లో గాలింపు చేపట్టి, అతనిని సురక్షితంగా ఒడ్డుకుచేర్చారు. సముద్రంలో గడిపినన్ని రోజులు చేపల్ని తింటూ బతికానని జోర్డాన్ తెలిపాడు.