: భగవద్గీత పోటీల్లో ప్రథమ బహుమతి గెల్చుకున్న ముస్లిం బాలిక
భగవద్గీత పోటీల్లో ఓ ముస్లిం బాలిక ప్రథమ బహుమతి గెల్చుకుని సత్తాచాటిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్ నెస్ (ఇస్కాన్) సంస్థ పాఠశాలల స్ధాయి భగవద్గీత పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో భగవద్గీత శ్లోకాలను సులభమైన రీతిలో వివరించిన కాస్మోపాలిటన్ హైస్కూల్ బాలిక మరియం సిద్ధిఖీ (12) ప్రథమ బహుమతి గెల్చుకుంది. మానవత్వమే గొప్ప మతమని అభిప్రాయపడిన సిద్ధిఖీని అంతా అభినందిస్తున్నారు.