: మలేషియా ఓపెన్ సెమీస్ కు దూసుకెళ్లిన సైనా
ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. తాజాగా మలేషియా ఓపెన్ సిరీస్ లో సెమీఫైనల్ కు చేరింది. కౌలాలాంపూర్ లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనా క్రీడాకారిణి సున్ యుపై 21-11, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ సెమీఫైనల్స్ లో చైనా టాప్ సీడ్ క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్ ఛాంపియన్ లి ఝురుయ్ తో సైనా పోటీపడనుంది.