: దుస్తులు మార్చుకునే రూమ్ లో సీక్రెట్ కెమెరా గుర్తించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ


కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఘోర పరాభవం తప్పింది. గోవాలోని ఓ ప్రముఖ దుస్తుల దుకాణంలో... దుస్తులు మార్చుకునే ట్రయల్ రూమ్ లో రహస్య కెమెరాను గుర్తించిన ఆమె షాక్ కు గురయ్యారు. తన కుటుంబంతో పాటు గోవాలో హాలిడే ట్రిప్ కు వెళ్లిన స్మృతి ఇరానీ... కండోలిమ్ లో ఉన్న ఫ్యాబ్ ఇండియా స్టోర్ కు షాపింగ్ కు వెళ్లారు. ఈ క్రమంలో, ఆమె దుస్తులు మార్చుకోవడానికి వెళ్లగా, అక్కడ సీక్రెట్ గా అమర్చిన కెమెరా ఆమె కంటబడింది. వెంటనే, ఆమె స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబోను పిలిపించి, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. లోబో మాట్లాడుతూ, కెమెరా డైరెక్ట్ గా ట్రయల్ రూమ్ వైపు పొజిషన్ చేయబడి ఉందని, అయితే దాన్ని గమనించడానికి వీలు కలుగని విధంగా కెమెరాను అమర్చారు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News