: భూ సేకరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపత్రి ఆమోదం


ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సూకరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్డినెన్స్ ఫైల్ పై సంతకం చేశారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుకు లోక్ సభలో ప్రతిపక్షాలు సవరణలు ప్రతిపాదించాయి. చివరికి తొమ్మిది సవరణలతో ప్రభుత్వం తిరిగి ఆర్డినెన్స్ ను పునః ప్రచురించింది. తాజాగా పంపిన ఆ ఆర్డినెన్స్ కే రాష్ట్రపతి అంగీకారం తెెలిపారు. అయితే రాజ్యసభలో ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం లేకపోవడం, దాంతో బిల్లు ఆమోదంపొందే అవకాశంలేకపోవడంతో పెద్దలసభలో ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో వేరే దారిలేక ప్రభుత్వం ఆర్డినెన్స్ ను మళ్లీ ప్రచురించి రాష్ట్రపతికి పంపాల్సి వచ్చింది. దాంతో ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 11 ఆర్డినెన్స్ లను విడుదలచేసింది.

  • Loading...

More Telugu News