: ఏపీలో ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చే ప్రమాదముంది: రాఘవులు


ఏపీలోని టీడీపీ పాలనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన మాదిరే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం కూడా తప్పు చేస్తోందని ఆరోపించారు. కేవలం రాజధాని నిర్మాణం, కొన్ని ప్రాంతాల అభివృద్ధిపైనే దృష్టి సారించడం వల్ల... ఇతర ప్రాంతాల ప్రజలు అసంతృప్తికి లోనవుతారని తెలిపారు. దీంతో, ఏపీలో ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. పట్టిసీమకు పెట్టే ఖర్చుతో ఉత్తరాంధ్రను డెవలప్ చేయవచ్చని తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు.

  • Loading...

More Telugu News