: బీజేపీని విమర్శించడం కాదు, ముందు మీ నేత ఎక్కడున్నాడో కనుక్కోండి: ప్రకాశ్ జవదేకర్
బెంగళూరులో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాటల తూటాలు పేల్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యాఖ్యానించారు. "ప్రతిపక్షం, ప్రత్యేకంగా కాంగ్రెస్ నిరాశతో ఉంది. లేని సమస్యలు కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. దానికి బదులుగా ముందు వారి పార్టీ నేతను కనుగొనేందుకు ప్రయత్నించాలి" అంటూ జవదేకర్ చురకలు వేశారు. బీజేపీ రైతులు గురించే ఆలోచిస్తుందని, వారికోసమే ఏదైనా చేస్తుందని అన్నారు. ప్రతిపాదించిన భూ సేకరణ సవరణ బిల్లు కూడా పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. రైతులు పండించిన పంటకు కనీస ధర పొందేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.