: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జయప్రద
సినీ నటి జయప్రద నేడు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మీడియాతో మాట్లాడుతూ, ప్రతి పుట్టినరోజుకు తాను స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని, ఎక్కడున్నా ఆ రోజుకి తిరుమల వస్తానని చెప్పారు. తెలుగు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని జయ తెలిపారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకు మరికొంత సేవ చేయాలనుకుంటున్నానన్నారు.