: 'ఆవు'ను రాష్ట్రమాతగా ప్రకటించాలంటున్న బీజేపీ ఎంపీ
ప్రతి భారతీయ మసీదులో గౌరి-గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్టు కొన్నిరోజుల కిందట భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపైనర్, ఎంపీ యోగీ ఆదిత్యానాథ్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మెదడులో ఆవు గురించి ఓ కొత్త ఆలోచన తట్టింది. 'ఆవు'ను రాష్ట్రమాత లేదా మదర్ ఆఫ్ నేషన్ గా గుర్తించాలని కోరుతున్నారు. ఆవును సనాతన హిందూమత చిహ్నంగా ఆయన పేర్కొన్నారు. దేశ ఆధ్యాత్మిక, ఆర్థిక విశ్వశాస్త్రానికి మధ్య సంబంధముందని అన్నారు. ఆవు వంశవృక్షం, వివిధ జంతువులు దేశంలోని మతపరమైన ప్రపంచానికి వారధిలా ఉంటాయని ఎంపీ పేర్కొన్నారు.