: ప్రస్తుతం నేను ఒంటరిని: జెన్నిఫర్ లోపెజ్
ప్రస్తుతానికి తాను ఒంటరినని గాయకురాలు, నటి జెన్నిఫర్ లోపెజ్ నొక్కి చెబుతోంది. గతవారం మాజీ ప్రియుడు కాస్పర్ స్మార్ట్ తో లిప్ టు లిప్ కిస్ పంచుకున్న ఫొటోను చూసిన అందరూ మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటయ్యారని భావించారు. అయినప్పటికీ 45 ఏళ్ల ఈ అమ్మడు ఇలా ప్రకటించడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దానిపై జెన్నీని అడగ్గా, "ప్రస్తుతానికి నేను ఒంటరిగా ఉన్నాను. థాంక్యు" అని నవ్వుతూ సమాధానమిచ్చింది. 27 ఏళ్ల డ్యాన్సర్ కాస్పర్, లోపెజ్ మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. గతేడాది వేసవి సమయంలో ఇద్దరూ విడిపోయారు. అంతకుముందైతే ఎక్కడ చూసినా ఇద్దరూ కలసి కనిపించేవారు.