: శ్రీనగర్ లో మళ్లీ భారీ వర్షాలు... ప్రమాదకర స్థాయి దాటిన జీలం నది
జమ్ము కాశ్మీర్ ప్రజలు మరింత ఆందోళనలకు గురవుతున్నారు. శ్రీనగర్ లో రాత్రికి రాత్రే భారీ వర్షాలు పడుతున్నాయి. రాజధాని (శ్రీనగర్) లో, కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో నిన్న (గురువారం) రాత్రి నుంచి తీవ్రంగా కురుస్తున్న వర్షాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీలం నది మరోసారి ప్రమాదకర స్థాయి దాటింది. అయితే వాతావరణం కొద్దిగా మెరుగుపడగా, తాజా వరదలతో ఎలాంటి ముప్పు లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూడవ రోజు కూడా మూసివేసి ఉంది.