: నా ఆస్తుల జప్తు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారు: దయానిధి మారన్


ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లోని రూ.740 కోట్ల మొత్తాన్ని ఈడీ జప్తు చేయడంపై కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈడీ చర్య అన్యాయమని, కొంతమంది ద్వారా ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. "ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు నాపై నేరారోపణలు మోపకముందు... అంటే 2002-03లో నేను సంపాదించినవి. వాళ్లు స్తంభింపజేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లు నా సొంత ఆదాయంలోనివి. కొంతమంది ప్రయోజనాల కోసమే ఈడీ ఇలా చేస్తోంది" అని మారన్ ఆంగ్ల చానెల్ ఎన్డీటీవీతో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News