: ‘సూర్యాపేట’ నిందితుల కోసం ఎస్ఐబీ, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ గాలింపు


నల్గొండ జిల్లా సూర్యాపేటలో కలకలం రేపిన కాల్పుల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ షూటర్ల కోసం గాలింపు ముమ్మరం చేసింది. ఇప్పటికే నిందితుల కోసం స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నల్గొండ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలను కూడా జల్లెడ పడుతున్నారు. ఈ ప్రత్యేక బృందాలకు అదనంగా ఆక్టోపస్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ బలగాలను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్ లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా... ఓ సీఐ, కానిస్టేబుల్ గాయపడ్డారు.

  • Loading...

More Telugu News