: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది దుర్మరణం
తమిళనాడులో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దిండిగల్ సమీపంలో లారీ- వ్యాన్ ఢీకొన్న దుర్ఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రెండు కుటుంబాలు ఊటీ విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.