: ఆ ఇల్లు... పాముల పుట్ట!


మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్ కు చెందిన మాచనూరి కృష్ణ ఇల్లు నిజంగా పాముల పుట్టే. కృష్ణ కుటుంబం నివాసముంటున్న సదరు ఇంటిలో నిన్న ఏకంగా 56 పాములు ఒకదాని వెంట మరొకటి బయటపడ్డాయి. బుధవారం రాత్రి రోజు మాదిరే నిద్రపోయిన కృష్ణ కుటుంబ సభ్యులకు తెల్లవారి నిద్ర లేచేసరికి పాములు దర్శనమిచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 56 పాములు ఒకదాని వెంట మరొకటి బయటకొచ్చాయి. తొలుత కృష్ణ తలదిండు కింద రెండు పాములను కనుగొన్న ఆయన కుటుంబ సభ్యులు, వాటిని చంపేశారు. ఆ తర్వాత మరో పాము కనిపించేసరికి వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరుగుపొరుగును పిలిచారు. వారంతా కలిసి మూడో పామును చంపేసి, సామాన్లు తరచిచూడగా, మరో మూడు పాములు బయటపడ్డాయి. దీంతో ఇల్లు మొత్తాన్ని జల్లెడ పట్టిన వారికి ఇంటి ప్రధాన ద్వారం కింద ఏకంగా 50 పాములు దర్శనమిచ్చాయి. పాములన్నింటిని గ్రామస్థులు చంపేసినా, కృష్ణ కుటుంబానికి పట్టుకున్న పాముల భయం మాత్రం వీడలేదు.

  • Loading...

More Telugu News