: సురేశ్ రైనా పెళ్లికి లవ్ జంట!


టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా వివాహం రేపు (శుక్రవారం) ఢిల్లీలో ప్రియాంక చౌదరితో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరిణయ మహోత్సవానికి ప్రధానితో పాటు, క్రికెట్ ప్రముఖులు హాజరవుతున్నారు. కాగా, వరల్డ్ కప్ జరిగినన్నాళ్లూ అందరి నోళ్లలో నానిన ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఈ పెళ్లికి వస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఈ లవ్ జంట మీడియా కంటపడింది. దీంతో, వారు రైనా మ్యారేజి కోసమే వచ్చి ఉంటారని భావిస్తున్నారు. రైనా వివాహ వేడుకలో కోహ్లీ, అనుష్క ప్రధానాకర్షణగా నిలుస్తారని క్రికెట్ వర్గాలంటున్నాయి. రైనా, కోహ్లీ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. అదలావుంచితే... కోహ్లీ కూడా త్వరలోనే ఓ ఇంటివాడవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నటి అనుష్క శర్మతో విదేశీ టూర్లకు వెళుతుండడంపై కోహ్లీని విమర్శకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అనుష్కను వివాహం చేసుకుంటే విమర్శలకు అడ్డుకట్ట పడుతుందని కోహ్లీ భావిస్తున్నాడట.

  • Loading...

More Telugu News