: ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 174 దేశాల్లో ప్రయాణించవచ్చట!
ప్రపంచంలోని ఐదు దేశాల ప్రజలు వీసా లేకుండా 174 దేశాల్లో ప్రయాణించవచ్చట. ఈ విషయాన్ని 'హెన్లీ అండ్ పార్టనర్స్' అనే సంస్థ తెలిపింది. శక్తిమంతమైన పాస్ పోర్టులు కలిగిన దేశాలపై ఆ సంస్థ ఓ ఇండెక్స్ రూపొందించింది. దాని ప్రకారం... ఫిన్ లాండ్, జర్మనీ, స్వీడన్, బ్రిటన్, అమెరికా దేశాల పాస్ పోర్టులు అత్యంత శక్తిమంతమైనవని ఆ సంస్థ తెలిపింది. ఈ దేశాల పాస్ పోర్టులు కలిగిన పౌరులు 174 దేశాల్లో వీసాలు లేకుండా ప్రయాణించవచ్చట. ఈ ఇండెక్స్ లో ఆఫ్ఘనిస్థాన్ అట్టడుగున ఉంది. ఆఫ్ఘన్ పాస్ పోర్టు కలిగిన పౌరులు కేవలం 28 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చట. ఈ ఇండెక్స్ ను 2014 నాటికి అమల్లో ఉన్న ట్రావెల్ నిబంధనలను అనుసరించి తయారు చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఇండెక్స్ కారణంగా ఏఏ దేశాలకు సత్సంబంధాలు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది.