: సరూర్ నగర్లో, సూర్యాపేటలో కాల్పులు జరిపింది ఒకరేనా?


హైదరాబాదు సరూర్ నగర్లో కాల్పులు జరిపిందీ, సూర్యాపేటలో కాల్పులు జరిపిందీ ఒకరేనా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. రెండు ఘటనల లింకుపై పోలీసు వర్గాల్లో అనుమానాలు బలపడుతున్నాయి. సరూర్ నగర్ లో నాగరాజుపై కాల్పులు జరిపిన దుండగులు, చాదర్ ఘాట్ వెళ్లి, అక్కడ నుంచి తాండూరు వెళ్లి, అక్కడి నుంచి గుడివాడ వెళ్లేందుకు విజయవాడ బస్సు ఎక్కినట్టు తెలుస్తోంది. వారిని ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, కాల్పుల్లో గాయపడిన సీఐ మొగిలయ్య, కిశోర్ లకు కిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరిగాయి, మొగిలయ్య శరీరం నుంచి రెండు బుల్లెట్లు బయటికి తీశారు. వీరిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరామర్శించారు.

  • Loading...

More Telugu News