: 7న బీసీసీఐ సాంకేతిక కమిటీ సమావేశంలో కీలకాంశాలపై చర్చ


ఏప్రిల్ 7న బీసీసీఐ సాంకేతిక కమిటీ కోల్ కతాలో సమావేశం కానుందని బోర్డు వర్గాలు తెలిపాయి. రంజీ జట్ల కెప్టెన్లు, కోచ్ ల సమావేశంలో వచ్చిన సూచనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, ఈ సమావేశంలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 చాంపియన్ షిప్ తేదీలను ఖరారు చేయాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డొమెస్టిక్ క్రికెట్ లో మార్పులు చేయాల్సిందిగా రంజీ జట్లు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత క్యాలెండర్ వల్ల ఆటగాళ్లు నష్టపోతున్నారు. దీంతో, డొమెస్టిక్ టీ20 షెడ్యూల్ ను ఐపీఎల్ వేలం కన్నా ముందే నిర్వహించాలని కోరుతున్నారు. దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు చెప్పారు. ఐపీఎల్ కంటే ముందే డొమెస్టిక్ టి20 పోటీలు జరిగితే, అక్కడ సత్తా చాటే ఆటగాళ్లకు ఐపీఎల్ వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News